హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి సమావేశానికి బాబ్జీ దూరం?

W.G: పెంటపాడు మండలం మౌంజీపాడులో కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కూటమి నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవాల దిశగా ముందుకెళ్లేలా చర్చించినట్లు సమాచారం. అయితే సమావేశంపై టీడీపీ ఇన్‌ఛార్జ్ బాబ్జీకి సమాచారం లేదని, దీంతో దిగువ శ్రేణి నేతలు హాజరుకాలేదని టాక్.