హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో ఈవీఎం గోదాముల తనిఖీ

CTR: గోదాములను కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. గోదాము షట్టర్ల సీళ్లు, తాళాలను పరిశీలించిన ఆయన భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో డీఆర్వో మోహన్ కుమార్, నోడల్ అధికారిణి శ్రీలక్ష్మి పాల్గొన్నారు.