కృష్ణా: గుడివాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికురాలు పోగొట్టుకున్న హ్యాండ్ బ్యాగ్‌ను ఆర్‌పీఎఫ్ సిబ్బంది చాకచక్యంగా గుర్తించి, గురువారం సురక్షితంగా బాధితురాలికి అప్పగించారు. బ్యాగ్‌లో బంగారు ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్ ఉన్నాయి. సుమారు రూ.3.59 లక్షల విలువైన వస్తువులను తిరిగి అందజేయడంతో ప్రయాణికురాలు ఆర్‌పీఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్‌పీఎఫ్ సిబ్బంది చాకచక్యంతో బ్యాగ్ లభ్యం


