SKLM: మందస మండలం సొండిపూడి జడ్పీహెచ్ఎస్‌లో గురువారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకుముకి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నగిరి కరుణాకర్ ప్రశ్నపత్రాలను విడుదల చేసి, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఇటువంటి పరీక్షలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి'


