హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమరాజుపల్లిలో ఉచిత టీబీ పరీక్షలు

ప్రకాశం: సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి ఆరోగ్య కేంద్రంలో ఉచిత టీబీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొబైల్ డిజిటల్ ఎక్స్-రే పరికరం ద్వారా గ్రామస్తులకు ఉచితంగా పరీక్షలు చేసి, వ్యాధిపై అవగాహన కల్పించారు. రెండు వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి టీబీ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.