హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏఐ రంగంలో శిక్షణకు ఎంపిక

SKLM: టెక్కలి సమీపంలో ఉన్న ఐతం ఇంజినీరింగ్ కళాశాల ఫైనల్ ఇయర్ ఐటీ విభాగానికి చెందిన 8 మంది విద్యార్థులు ఏఐ ఇంజినీర్ ఇంటర్న్‌లుగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌కు చెందిన అమునిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పరిశ్రమ శిక్షణకు వీరు ఎంపికైనట్లు కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి.నాగేశ్వరరావు గురువారం తెలిపారు. మూడు నెలల పాటు స్టయిఫండ్‌తో కూడిన శిక్షణ ఉంటుందన్నారు.