హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితాను తనిఖీ చేసిన అధికారి

W.G: ఉంగుటూరు మండలం సీతారాంపురంలో జిల్లా పంచాయతీ అధికారి జి.వి.కె. మల్లిఖార్జునరావు గురువారం పర్యటించారు. గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తిస్తూ రూపొందించిన ఓటర్ల జాబితాను పరిశీలించారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో జి. రమేష్‌బాబు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.