ELR: ఉంగుటూరు మండలం కాకర్లమూడి శివారు తోట రామచంద్రపురంలో ఫిల్టర్ బెడ్ మరమ్మతు పనులను ఎంపీడీవో జి.ఆర్. మనోజ్ గురువారం పరిశీలించారు. ఫిల్టర్ బెడ్ పాడైపోయాయని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఎంపీడీవో నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టించారు. పనులను త్వరగా పూర్తి చేసి గ్రామస్తులకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్యపై ఎంపీడీవో స్పందన


