హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే చొరవతో అంగన్వాడీ కేంద్రానికి మహర్దశ

ATP: కుందుర్పి మండలం అపిలేపల్లిలోని 3వ అంగన్వాడీ భవనం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చొరవతో కొత్త రూపు సంతరించుకుంది. తన సొంత నిధులతో భవనానికి రంగులు వేయించి, అవసరమైన వసతులు కల్పించారు. చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించినందుకు ఎమ్మెల్యే సురేంద్రబాబుకు గ్రామీణులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.