హైదరాబాద్: 28°C
వార్తలు

చైనీయులను కాపాడిన భారత కోస్ట్ గార్డ్

ఒడిశాలోని పారాదీప్ సమీపంలో సముద్రంలో మునిగిపోయిన నౌక నుంచి ఇద్దరు చైనీయులను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ఈ నెల 22న వారిని రక్షించి, అవసరమైన వైద్య చికిత్స అందించినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. అనంతరం వారికి తగిన వైద్యం అందించి, ఈరోజు సంబంధిత అధికారులకు సురక్షితంగా అప్పగించినట్లు వెల్లడించారు.