AP: ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఎల్.ఎల్. గుడిపాడులో నిర్వహించిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదికను నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లను ప్రారంభించారు.
వార్తలు
'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి


