హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీలో ఘోర విమాన ప్రమాదం

UPలో ఒక శిక్షణ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. కాన్పూర్‌లోని గంగా బ్యారేజ్ సమీప గ్రామం శివార్లలోని పొలంలో ఈ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్, ట్రైనీ పైలట్ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. విమానం గాల్లో ఉండగా నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.