హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

ప్రకాశం: పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసిన సంఘటన గురువారం మద్దిపాడు మండలం నందిపాడు గ్రామ శివారులలో చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పేకాట ఆడుతున్న సమాచారం రావడంతో శిబిరంపై దాడి చేసి ఆరుగురు వ్యక్తులు అదుపులోనికి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి 4710 నగదును స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.