హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

GNTR: అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటివారు వేధించడంతో తాడికొండ మండలం మోతడకు చెందిన అనూష(15) పురుగు మందు తాగింది. రాజేష్‌తో ఆమెకు ఏడాదిన్నర కిందట వివాహం కాగా, పెళ్లి సమయంలో రూ.లక్ష, ఉంగరం ఇచ్చారు. భర్త, అత్తమామల వేధింపులతో ఆమె ఈ చర్యకు పాల్పడగా, గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.