హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుబజార్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్‌

GNTR: మంగళగిరిలో ఆధునిక హంగులతో నిర్మించనున్న మోడల్‌ రైతుబజార్‌కు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. రూ.18 కోట్లతో మోడల్ రైతుబజార్​ను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. రైతుబజార్‌లో 5.9 ఎకరాల్లో హోల్‌సేల్, రిటైల్‌ వెజిటబుల్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్‌ఆర్ నిధులతో వెజిటబుల్‌ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.