AKP: గొలుగొండ మండలం సీహెచ్.నాగాపురం గ్రామంలో గురువారం మరిడమ్మ పండగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాల మధ్య భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామస్థులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా మరిడమ్మ పండుగ


