హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణకార సంఘానికి పూర్తి సహకారం

E.G: స్వర్ణకార సంఘం సంక్షేమానికి అన్ని విధాల సహకారం అందిస్తామని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన స్వర్ణకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నూతనంగా ఎన్నికైన స్వర్ణకార సంఘం ప్రతినిధులను అభినందించారు.