హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిల్లులు లేకుండా బంగారం కొంటే చర్యలు.. సీఐ

కోనసీమ: దొంగిలించిన బంగారు వస్తువులను కొందరు బంగారు షాపు యజమానులు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం నేపథ్యంలో రావులపాలెం పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బంగారు నగలు, వస్తువులు విక్రయించేందుకు వచ్చే వారి వద్ద తప్పనిసరిగా కొనుగోలు బిల్లులను పరిశీలించాలని సూచించారు. బిల్లులు లేని బంగారంతో ఎవరైనా వస్తే సమాచారం అందించాలని రావులపాలెం సీఐ రమేష్ బాబు తెలిపారు.