AKP: కసింకోట జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో గురువారం విద్యార్థులకు చెకుముకి పోటీలు నిర్వహించారు. అనకాపల్లి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 40 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు హెచ్ఎం స్వర్ణకుమారి తెలిపారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని కలిగించేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. ఈ పోటీల్లో విజేతలు మండల స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు చెకుముకి పోటీలు


