హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందుల హౌసింగ్ ఈఈగా రమణారెడ్డి

KDP: పులివెందుల డివిజన్ హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా రమణారెడ్డిని హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు నియమించారు. ఈ సందర్భంగా ఆయన పులివెందులలో హౌసింగ్ EEగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డివిజన్‌లో 6 వేల మంది లబ్ధిదారులకు పక్కా గృహాలు అందేలా కృషి చేస్తానన్నారు. పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ గృహాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.