హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామ సమీపంలోని 67 నెంబర్ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థి భవ్య శ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ పై వస్తున్న తండ్రి, కూతుర్ని లారీ ఢీకొంది. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.