హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'దొంగల సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

TPT: ఏర్పేడులోని డేవిడ్ & లాయిస్ రీస్ హాస్పిటల్ ప్రాంగణంలోకి ఈనెల 25న అర్ధరాత్రి ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు ఇనుప రాడ్లతో చొరబడిన ఘటన కలకలం రేపింది. ప్రాంగణంలోని సిబ్బంది మోటార్‌సైకిల్‌ను తీసుకెళ్లి కొంత దూరంలో వదిలివెళ్లినట్లు సమాచారం. ఈ కదలికలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆసుపత్రి వర్గాల ఫిర్యాదుతో ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.