అన్నమయ్య: సంబేపల్లి మండలంలోని దేవపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లేలాండ్ వాహనం ఢీకొనడంతో దేవపట్లకు చెందిన దేవర్షిని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. దేవర్షిని మృతితో దేవపట్లలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. యువతి మృతి


