హైదరాబాద్: 28°C
వార్తలు

కన్నీటిపర్యంతమైన సద్గురు జగ్గీ వాసుదేవ్

ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానససరోవర్ యాత్రకు వెళ్లిన భక్తులలో 80 మంది గల్లంతు కావడంతో సద్గురు కన్నీటిపర్యంతమయ్యారు. తాను కూడా సరిగ్గా అదే ప్రదేశానికి రేపు వెళ్లాల్సి ఉందని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. తప్పిపోయిన యాత్రికులు క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. అలాగే సహాయక చర్యల గురించి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.