హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులు క్షేమంగా తిరిగివచ్చారు: ఎంపీ

TPT: కోనసీమ జిల్లా నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్‌లోని దిఘా ప్రాంతంలో క్షేమంగా బయటపడటం సంతోషంగా ఉందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. వారి రక్షణకు సహకరించిన కోస్ట్‌గార్డ్, అధికారులు, దిఘా మత్స్యకారులకు హోంమంత్రి అమిత్ షాకు, రక్షణ మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.