హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడుకు కళ్లెదుటే తల్లిపై అత్యాచారం

నారాయణపేటలోని మక్తల్‌లో దారుణం చోటుచేసుకుంది. భిక్షాటన చేసే మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న కుమారుడిని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి చేతికి ఉన్న వెండి కడియాలను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.