హైదరాబాద్: 28°C
వార్తలు

20 రోజుల్లో 60 మంది శిశువులు మృతి

బెంగాల్‌లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆగస్టు మొదటి మూడు వారాల్లోనే 60 మంది శిశువులు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందులో ఒకే రోజు ఏకంగా 10 మంది శిశువులు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భారీ సంఖ్యలో శిశు మరణాలు సంభవించడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు గల కారణాలపై తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.