హైదరాబాద్: 28°C
తెలంగాణ

హనుమాన్ ఆలయంలో చోరీ.. రూ.50 వేల నగదు అపహరణ

MHBD: మహబూబాబాద్ పట్టణంలోని మంగల్ కాలనీలో హనుమాన్ దేవాలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి హుండీని పగులగొట్టి సుమారు రూ.50 వేల నగదును అపహరించారు. గురువారం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. ఆలయంలో చోరీ జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.