హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సులో చోరీపై పోలీసుల దర్యాప్తు

ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీసులు బస్సులో చోరీకి గురైన బంగారం గురించి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం వెంకట కృష్ణ అనే వ్యక్తి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్తున్నారు. ఈ క్రమంలో 240 గ్రాముల బంగారం చోరీకి గురైంది. బాధితుడు ఫిర్యాదు మేరకు టంగుటూరు పోలీస్ స్టేషన్‌కి బస్సు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.