ప్రకాశం: యర్రగొండపాలెంలోని డాక్టర్స్ ప్రజా వైద్యశాలలో వైద్యం వికటించి మాబున్నీ(25) అనే గర్భిణి మృతి చెందింది. ఆరు నెలల గర్భాన్ని తొలగించే ప్రయత్నంలో కాంపౌండర్ శ్యామ్ ఇంజెక్షన్ వేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో ఆసుపత్రిని బంధువులు ముట్టడించి ఆందోళన చేపట్టారు. డాక్టర్లు లేకుండా వైద్యం చేస్తున్న ఆసుపత్రులు, కాంపౌండర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
యర్రగొండపాలెంలో వైద్యం వికటించి గర్భిణి మృతి


