హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీమంత్రి హరీష్ రావు గృహనిర్భంధం

TG: హైదరాబాద్‌ కోకాపేటలోని నివాసంలో మాజీమంత్రి హరీష్ రావు గృహనిర్బంధం చేశారు. వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లకుండా హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన వరంగల్ వెళ్లకుండా అడ్డుపడ్డారు. హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.