హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీలో దిగజారిన శాంతిభద్రతలు: అఖిలేశ్‌ యాదవ్‌

UPలో ప్రముఖ హర్యాన్వీ గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బల్యాన్‌ను దుండగులు కాల్చిచంపారు. 33 ఏళ్ల అంకిత్‌పై ఇద్దరు దుండగులు 18 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు, ఈ హత్యపై జాట్‌ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.