హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామస్తులను భయపెడుతున్న కోతులు!

BHPL: కాటారం మండలం చింతకానిలో కోతుల బెడద తీవ్రంగా మారింది. గుంపులుగా గ్రామంలోకి వస్తున్న కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ధ్వంసం చేయడంతో పాటు పంటలకు నష్టం కలిగిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.