హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రాహ్మణపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ATP: రాయదుర్గం-అనంతపురం హైవేపై బ్రాహ్మణపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గానికి చెందిన నలుగురు కడూరు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాఘవేంద్ర గుప్త, నాగరాజు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.