హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: నిర్మలా సీతారామన్

కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో నిర్వహించిన బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆ దేశ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందన్నారు. ఇక్కడ దీర్ఘకాలిక పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.