హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాలువల నిర్మాణంతో దళితులు భూములు కోల్పోతున్నారు'

JN: జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు జలాశయం నుంచి జఫర్గడ్ చెరువు మీదుగా పాలకుర్తికి వెళ్లే కాలువల నిర్మాణంతో దళితులు భూములు కోల్పోతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు సుభాష్ అన్నారు. హిమ్మత్‌నగర్‌లో కాలువల పనులను బుధవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. జఫర్గడ్ చెరువును మినీ జలాశయంగా మార్చే నిర్ణయంతో దళిత కుటుంబాలకు అన్యాయం జరగకుండా పార్టీ అండగా ఉంటుందన్నారు.