KRNL: ఎమ్మిగనూరులో గంగన్న మసీదు దగ్గర విషాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి పెళ్లిలో డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా బోయ వెంకటేశ్(22) కుప్పకూలిపోయాడని స్థానికులు తెలిపారు. తోటి స్నేహితులు, బంధువులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లై మూడు నెలలు కావడంతో మృతుడి ఇంట రోదనలు మిన్నంటాయి.
ఆంధ్రప్రదేశ్
DJ ముందు డాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు


