హైదరాబాద్: 28°C
వార్తలు

నేపాల్ వరదలు.. 160 మంది మృతి

మెరుపు వరదల కారణంగా నేపాల్‌లో మృతుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ఇప్పటివరకు 160 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 750 మందికి పైగా గల్లంతయ్యారు. ఇందులో 133 మంది భారతీయులు ఉన్నారు. అయితే, హైదరాబాద్‌ నుంచి వెళ్లిన 31 మంది యాత్రికుల బృందం క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.