హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శ్రీ చైతన్య పాఠశాల బెదిరింపులకు భయపడం'

MBNR: జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య యాజమాన్యం బెదిరింపులకు ఏమాత్రం భయపడమని డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్ అన్నారు. డివైఎఫ్ఐ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతుందని ఆరోపించారు. దానిపై నిరసన వ్యక్తం చేస్తే మాపై దొంగతనం కేసును పెట్టారని, ఇది ఎంతవరకు సమంజసమని అన్నారు.