SKLM: జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడును నరసన్నపేటలో హత్య చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈనెల 17న కింతలి ధనలక్ష్మి, బెండి అచ్యుతరావుతో పాటు మరో ముగ్గురు కలసి హత్య చేశారని అన్నారు. ఈ కేసులో మృతురాలు వద్ద ఉన్న 24 తులాల బంగారాన్ని కాజేసారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హత్య కేసులో నిందితులు అరెస్టు


