హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు రోజుల పాటు వర్షాలు

ASR: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.