ASR: పీఎం జన్మన్ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. సాగర పంచాయతీ అడపవలసలో జరిగిన సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడారు. 2.0 సర్వేలో అర్హులైన లబ్ధిదారులకు వెంటనే గృహాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే రోడ్లు, తాగునీరు సౌకర్యం కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గృహాల బకాయిలు చెల్లించాలి'


