కోనసీమ: రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అయినవిల్లి మండలం తొత్తరమూడి బొక్కవారిపాలెంలో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. APRRSP స్కీం కింద సుమారు రూ.77 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రహదారుల నిర్మాణానికి విశేష కృషి: ఎమ్మెల్యే


