హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనల‌ పాటింపుతో సురక్షిత ప్రయాణం: ఎస్ఐ

BHNG: రోడ్డు భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటిస్తేనే ప్రయాణాలు సురక్షితంగా సాగుతాయ‌ని మోటకొండూర్ ఎస్ఐ కుమారస్వామి యాదవ్ అన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలపై వాహనదారులకు, ప్రజలకు బుధవారం మోటకొండూర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. రహదారులపై వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు.