హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాచవరంలో గురజాల ఆర్డీవో తనిఖీ

PLD: దాచేపల్లి మండలం పెదగార్లపాడు శ్రీ సిమెంట్స్ మైనింగ్ పేలుళ్ల ధాటికి కాచవరంలోని ఇళ్లు దెబ్బతింటున్నాయి. విషయం తెలుసుకున్న గురజాల ఆర్డీవో మురళీకృష్ణ బుధవారం గ్రామానికి వచ్చి ప్రత్యక్షంగా దెబ్బతిన్న గృహాలను తనిఖీ చేశారు. బాధితులతో మాట్లాడిన అనంతరం, మైనింగ్ అధికారులతో చర్చించి గ్రామస్థుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.