హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

ASR: జీ.మాడుగుల మండలం జి.ఎం.కొత్తూరు వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కన పశువుల కోసం ఎదురుచూస్తున్న గడుగు కొండబాబు (55)ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కొండబాబును ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ద్విచక్రవాహనం నడిపిన సిదరి వెంకట్‌ అదుపుతప్పి ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.