హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల సమస్యలపై ఆరా..!

PPM: సాలూరు మండలం పి.ఎన్.బొడ్డవలసలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ను రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం బుధవారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి విద్యాభ్యాసం, వసతి, భోజనం, తాగునీరు, పారిశుధ్యం, బోధన వంటి సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వారి విద్యా ప్రగతి, భవిష్యత్ లక్ష్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.