హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థి కుటుంబానికి పరిహారం

PPM: సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రూ.5 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి, ఈ విషాద సమయంలో ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.