ASF: జిల్లా పోలీసులు పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా, కాగజ్‌నగర్‌లోని ఆదర్శ్‌నగర్, బాలాజీనగర్ పరిసరాల్లో దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.18,500 నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.
తెలంగాణ
పేకాట స్థావరాలపై ఉక్కుపాదం


