లంచాలు సమానంగా పంచుకుందామని గంగాజలంతో కౌన్సిలర్లు ప్రమాణం చేసిన వీడియో వైరల్‌గా మారింది. UPలోని షాజహాన్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కౌన్సిలర్లంటూ ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. లంచాలు.. సభ్యులు సమానంగా పంచుకోవాలని, దీనిని ఉల్లంఘించిన వారిని ద్రోహిగా చూస్తామంటూ ప్రమాణం చేశారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వార్తలు
VIRAL: 'లంచాలు సమంగా పంచుకుందాం'


